అర్హులైన పట్టభద్రులను..ఓటర్లుగా నమోదు చేయించండి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో కడప – అనంతపురం – కర్నూలు గ్రాడ్యుయేట్ మరియు టీచర్ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నిర్వహించాల్సిన ప్రక్రియ లపై ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేది నుంచి నవంబర్ 7వ తేది వరకు పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల ఎన్నికల నమోదు ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఓటర్ల నమోదు తక్కువగా ఉందని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, నమోదును పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓలను ఆదేశించారు.సచివాలయ ఉద్యోగులు, చాలా వరకు గ్రాడ్యుయేట్ లు అయిఉంటారని, వారందరినీ గ్రాడ్యుయేట్ ఓటర్ జాబితా లో నమోదు చేయించాలని ఆదేశించారు. .అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు,పాలిటెక్నిక్ తదితర కళాశాలల్లో ఉన్న ఉపాధ్యాయులను ఓటర్లు గా నమోదు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవో, ఇతర అధికారులను కలెక్టర్ ఆదేశించారు..తహసీల్దార్లు ఓటర్ నమోదుకు వీలుగా తగిన పబ్లిసిటీ, టామ్ టామ్ చేయించాలని సూచించారు. పట్టభద్రుల ఓటరు జాబితాలో నమోదు చేసుకొను దరఖాస్తుదారులు 31-10-2019 లోపు పట్టభద్రులై ఉండాలని,నిర్ణీత ఫారం-18 ద్వారా వీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు.. ఉపాధ్యాయులు ఆరు సంవత్సరాలలో మొత్తం మూడు సంవత్సరాల పాటు ఉపాధ్యాయులు అయి ఉండాలని, వీరు ఫారం 19లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తులను ceoandhra.nic.in ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా నమోదుచేసుకోవచ్చన్నారు..మాన్యువల్ దరఖాస్తులు సంబంధిత ఆర్డీఓ, ఎమ్మార్వో, ఎంపీడీవోల కార్యాలయాల్లోఅందించాలన్నారు.అక్టోబర్ 1వ తేది నుంచి నవంబర్ 7వ తేది వరకు ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందన్నారు. వచ్చిన దరఖాస్తులను పక్కాగా వెరిఫికేషన్ జరిగేలా చూడాలని ఎన్నికల నిర్వహణ అధికారులను ఆదేశించారు..ఎన్నికల ప్రక్రియలో గ్రామ/వార్డు వాలంటీర్లను, బూత్ లెవెల్ అధికారులుగా నియమింపబడని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను భాగస్వాములుగా చేయరాదని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్, ఆఫ్లైన్ లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత డిజిటైజ్ చేయాలని తహశీల్దార్ లను ఆదేశించారు.. ఓటర్ల నమోదు పెంచేందుకు తహసిల్దారులు సంబంధిత ఎంఈవోలు విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.ఓటర్ల నమోదుకు సంబంధించి తమ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేయాలని జేసీ ఆదేశించారు.. ఓటర్ నమోదు అర్హత, ఎన్రోల్మెంట్ ప్రక్రియ, దరఖాస్తుల ఎంక్వయిరీ తదితర అంశాలకు సంబంధించిన నిబంధనల గురించి జేసీ కూలంకషంగా వివరించారు. సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ప్రొబేషనరీ డెప్యూటీ కలెక్టర్ లు ఎన్.మనోజ్ రెడ్డి, జి.వి.రమణ కాంత్ రెడ్డి, మున్సిపల్ అదనపు కమీషనర్ రామలింగేశ్వర్, జెడ్పీ సీఈవో నాసర రెడ్డి, డ్వామా పిడి అమర్ నాథ్ రెడ్డి,డిప్యూటీ కలెక్టర్లు రమ, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, పత్తికొండ ఆర్డిఓ మోహన్ దాస్, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.