PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువతను ఓటర్లు గా నమోదు చేయించండి..

1 min read

ఈ రోజు నాలుగు కళాశాలలో స్వీప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది…

పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి/ జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య…

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గము కి సంబంధించి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ను అసెంబ్లీ ఎన్నికల అధికారి/ జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు వివిధ పార్టీ  ప్రతినిధులతో నిర్వహించారు. శుక్రవారం ఉదయం పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ను నియోజకవర్గం ఎన్నికల అధికారి అయిన జిల్లా జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తన చాంబర్లో నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అన్ని పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ… గత వారం నిర్వహించిన ఓటర్ నమోదు కార్యక్రమంలో దాదాపు తొమ్మిది వేల కొత్త ఓటర్లు నమోదు అయ్యారని తెలిపారు. ఈరోజు నాలుగు కళాశాలలో ఓటరు నమోదు కార్యక్రమము (స్వీప్) ను నిర్వహించడం జరిగిందని , ఇంకా ఓటరుగా నమోదు కాని వారు , 18 సంవత్సరాలు నిండిన వారు మరియు జనవరి 1వ తారీకు నాటికి 18 సంవత్సరాలు నిండు వారు వెంటనే నిర్దేశిత ఫారం ద్వారా బిఎల్ఓ లకు అందజేసి ఓటర్లుగా నమోదు కావాలని కోరారు. డిసెంబర్ 9వ తారీకు అర్ధరాత్రి వరకు ఆన్లైన్ లో ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రజలను మరియు పార్టీల ప్రతినిధులు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి జనాభా ప్రాతిపదికన పాణ్యం నియోజకవర్గంలో ఓటర్ నమోదు శాతాన్ని అధికంగా పెంచే విధంగా కృషి చేయాలని కోరారు.రాజకీయ పార్టీల వారు గుర్తించిన తప్పులను  మరియు మార్పులను చేయించుటకు డిసెంబర్ 9వ తారీకు లోగా నిర్దేశిత ఫారం ద్వారా బిఎల్ఓ లకు అందజేయాలని లేదా ఆన్లైన్లో  నిర్దేశిత ఫారం ద్వారా వెంటనే చేయాలని కోరారు. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున యశ్వంత్ రెడ్డి , కమ్యూనిస్టు పార్టీ తరఫున శ్రీనివాసులు , న్యూ డెమోక్రసీ పార్టీ తరపున భాస్కర్ , బిజెపి తరఫున నవీన్ కుమార్ రెడ్డి , వైయస్సార్ పార్టీ తరఫున హనుమంత్ రెడ్డి , సిపిఐ పార్టీ తరఫున రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author