కులగణనలో విశ్వబ్రాహ్మణులుగా నమోదుచెయ్యాలి..
1 min read– విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు శివశ్రీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : వంశపారంపర్యంగా 5వృత్తులపై జీవిస్తున్న విశ్వబ్రాహ్మణులను వృత్తులపేర్లతోకాక కులగణనలో విశ్వబ్రాహ్మణులుగా నమోదుచెయ్యాలని పశ్చిమగోదావరిజిల్లావిశ్వబ్రాహ్మణ సంఘప్రధాన కార్యదర్శి విశ్వబ్రాహ్మణధర్మపీఠం ఆంధ్రప్రదేశ్ ప్రధానసంచాలకులు అప్పలభక్తులశివకేశవరావు ప్రభుత్వా న్నికోరారు. శనివారం స్థానిక జిల్లాపరిషత్ సమావేశహాలులో జిల్లాకలక్టర్ ప్రసన్నవెంకటేష్ అధ్యక్షతన జరిగిన మేధావులు కులసంఘాలప్రతినిధులసమావేశంలో శివశ్రీ పాల్గొన్నారు. సమావేశంలో శివశ్రీ ప్రసంగించి అనంతరం కలక్టర్ కు వినతిపత్రాన్నిసమర్పించారు. విశ్వబ్రాహ్మణులకు ఏసామాజికవర్గానికి లేని విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు పంచవృత్తులనిర్వహణ కర్తవ్యాలుగావున్నవని పేర్కొన్నారు. సృష్టికర్త విశ్వకర్మభగవానుడు దేవతలకు మానవాళిమనుగడకు అవసరమైన వస్తోత్పత్తి చేయుటకొరకు మానవాళిని వైదికసనాతనధర్మమార్గంలో నడిపించుటకొరకుసృష్టించిన ప్రత్యేక సృజనకారులే విశ్వబ్రాహ్మణులుగా ఉన్నారని ఆయనతెలిపారు. పురాణకాలంలో దేవబ్రాహ్మణులుగా, శిల్పిబ్రాహ్మణులుగా, విశ్వకర్మలుగా, పంచాణనం వారుగా, ఒకేశాలలో తమవృత్తులు నిర్వహించుటవల్ల కర్మశాలురుగా, వ్యవహరించేవారని. అయోధ్య, ద్వారక, లంకాపట్టణం, వంటి అత్యధ్భుతనిర్మాణాలు మొదలుకొని నేటి భారతదేశశిల్పసంపద అపూర్వకట్టడాలు తమపూర్వీకుల కళాకౌశల్యానికి మచ్చుతునకలుగాపేర్కొన్నారు.కాలక్రమంలో తమజాతీయుల వారసత్వ సృజనాత్మకతను సమాజము ప్రభుత్వాలు గుర్తించకపోవడం తగినవిధంగా ప్రోత్సహించక పోవడంవల్ల కేవలం వృత్తిపనివారుగామిగిలారని ఆవేదనవ్యక్తంచేశారు. ఆవృత్తులు కూడా కార్పోరేట్ సంస్థలతో పోటీపడలేక మనుగడసాగించడం కష్టతరంగా మారిందన్నారు.నూటికి 95మంది దుర్భరపరిస్థితుల్లోకాలంగడపుతున్నారని తెలిపారు.తమసామాజికవర్గం కులగణనద్వారా జనాభాదామాషా ప్రకారం ఆర్ధిక సామాజిక విద్యా ఉద్యోగ రాజకీయరంగాలలో తగినప్రాధాన్యతలభిస్తుందని ఆశాభావాన్నివ్యక్తంచేశారు.విశ్వబ్రాహ్మణ పంచశిల్పకారులు అయోశిల్పం ఇనుముతోతయారుఛేయవుత్పత్తి దారులను(బ్లాక్స్మిత్) కమ్మరులుగాను.దారుశిల్పులు కర్ర చక్కతో తయారుచేయువుత్పత్తులను వడ్రంగులుగాను(కార్పెంటరి)తామ్రశిల్పి ఇత్తడి రాగి కంచు లోహములతో చేయు ఉత్పత్తిదారులను కంచరులుగానుశిలను దేవతాశిల్పములుగా మలచు వారిని శిల్పులు గాను బంగారు వెండి ఆభరణములను ఉత్పత్తిచేయు స్వర్ణశిల్పులను స్వర్ణకారులు గాను పిలవడంపరిపాటి గావస్తున్నదని ఈవృత్తులతోపాటు వైదిక బ్రాహ్మణులుగా వున్న విశ్వబ్రాహ్మణులు వేదపండితులుగాను స్మార్త ఆగమ స్థపతి పురోహితులు అర్చకులు వాస్తుశిధ్ధాంతులు పంచాంగ గణికులు వివిధ వ్యాపార ఉద్యోగరంగాలలో జీవిస్తున్నారనివివరించారు అయితే అవగాహనలోపము కించపరచేఉద్దేశ్యాలతోకంసాలి వడ్రాబత్తులు కమ్మరోళ్ళు వడ్రంగులు ఇలా వివిధరకాలపేర్లతో పిలుస్తు న్నారని ప్రభుత్వరికార్డులలోను సభలుసమావేశములలోను ప్రవచనకారులు సయితం కించపరిచేవిధంగా మాసామాజికవర్గాన్ని పేర్కొనడం మామనోభావాలను కించపరస్తు న్నట్లుగాభావిస్తున్నామన్నారు.మాపూర్వీకులు బ్రిటీష్ వారిపాలనాకాలంలో జనగణనలో విశ్వబ్రాహ్మణ గాప్రభుత్వరికార్డులలో నమోదుచేయవలశినదిగా విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ద్వారా న్యాయస్థానాల ద్వారా ప్రతిపాదించుట జరిగినదనిప్రస్తుత ప్రభుత్వంవారు కులగణన చేపట్టటాన్ని స్వాగతిస్తూ తమసామాజికవర్గం పైఏవృత్తలలో వున్నను కులగణనలో విశ్వబ్రాహ్మణ బిసి.బి సీ.నెం 21 గానేనమోదుచేయగలందులకు గణనచేయుశిబ్బందికి ఈవిధమైనసూచనలు చేయవలశనదిగా కోరారు. అలాగే విశ్వబ్రాహ్మణులను కంసాలి వడ్రంగి కంచరోళ్ళువంటి వృత్తి నామాలతో పిలవడాన్ని నిషేధించవలశిందిగానుమీద్వారా ప్రభుత్వాన్ని కోరారు. శివశ్రీతోపాటు విశ్వబ్రాహ్మణ ఉద్యోగ వ్యాపారులసంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి లంకలపల్లిజగదీష్ పాల్గొన్నారుస