జగనన్న కాలనీ పట్టాదారులకు రిజిస్ట్రేషన్ లు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : ప్రభుత్వం పేదలకు జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీ లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిన్న జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు మేరకు శనివారం నుండి గడివేముల గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది ఈ ఓ అర్ డీ పంచాయతీ కార్యదర్శులు వీఆర్వోల సమక్షంలో లబ్ధిదారుల సమాచారం సేకరించి ఆన్లైన్ ప్రక్రియ చేపడుతున్నారు ఆదివారం కూడా గ్రామ సచివాలయంలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.