పంచాయతీరాజ్ పనులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ
1 min read
ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం
జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన ఈరోజు జడ్పీ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ద్వారా మంజూరు చేయబడిన పంచాయతీ రాజ్ అభివృద్ధి పనుల పురోగతి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS), ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి కనెక్టివిటీ ప్రాజెక్ట్ (APRRCP) కింద చేపట్టిన రహదారి పనుల పురోగతి, ఇంకా జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో పెండింగ్‌లో ఉన్న పనులపై జెడ్పి చైర్ పర్సన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ,జిల్లాలో గ్రామీణ అభివృద్ధి పనులు వేగంగా మరియు నాణ్యతా ప్రమాణాలతో పూర్తయ్యేలా అధికారులు కృషి చేయాలని, ప్రజలకు ప్రయోజనం కలిగేలా, ప్రణాళికాబద్ధంగా పనులు అమలు చేయాలన్నారు. అన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.సమీక్షలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలుజిల్లాలో చేపట్టిన పంచాయతీ రాజ్ పనులపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరిపించడం MGNREGS కింద చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేయడంతో పాటు, కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవడంPMGSY కింద రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడంఈ సమీక్షలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.