PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంట్రాక్ట్​ ఉద్యోగులను…రెగ్యులర్​ చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్, ఆదోని రూరల్​: వైద్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారా మెడికల్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని పెద్దహరివాణం పీహెచ్​సీ పారామెడికల్​ సిబ్బంది వాసుదేవ రెడ్డి కోరారు. శుక్రవారం ఆరోగ్య కేంద్రాల ముందు నిరసన చేపట్టారు. అనంతరం వాసు దేవ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా సేవలు అందించామన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది మృతి చెందారని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఆర్థికంగా ఆదుకోవాలని, అలాగే ప్రస్తుతం కాంట్రాక్ట్​ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న వారికి రెగ్యులరైజ్​ చేయాలని కోరారు. అనంతరం పెద్దహరివాణం డాక్టర్ రామచంద్రుడుకు వినతి పత్రం అందజేశారు.

About Author