వ్యాధుల నుండి కొలుకోవడంలో రిహాబిలిటేషన్ కీలకం
1 min read– అన్ని వయసుల వారికి రిహాబిలిటేషన్ సేవలు
– రాయలసీమలొనే ఏకైక రిహాబిలిటేషన్ సెంటర్
– ఆకట్టుకున్న చిన్నారుల నృత్యాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : వ్యాధులను అధిగమించడంలో రిహాబిలిటేషన్ థెరపీ, ఫిజియోథెరఫి చాలా దోహదం చేస్తుందని అన్నారు కిమ్స్ కర్నూలు ఎండి. డా. సుధాకర్, డా. రఫిక్. ఆదివారం కిమ్స్ హరితం బ్లాక్ లో కిమ్స్ హరితం 5వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్స్ కర్నూలు యూనిట్ హెడ్ డా. సునీల్ మాట్లాడుతూ… రాయలసీమ ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యలతో, చిన్న పిల్లలు, పెద్దలకు ఒకే చోట రెహాబిలిటేషన్ కిమ్స్ కర్నూలు లో ఉందని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోందని వివరించారు. రాయలసీమలోని అన్ని జిల్లాలకు చెందినవారు , అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నారు అని పేర్కొన్నారు. మాటలు రాని పిల్లలకు ఇక్కడ ప్రత్యేకంగా స్పీచ్ థెరపీ నేర్పిస్తారని తెలిపారు. అంతే కాకుండా న్యూరో రిహబిలిటేషన్, కార్డియో రిహాబిలిటేషన్ సదుపాయం కలిగి ఉందన్నారు. అనంతరం చిన్నపిల్లల న్యూరాలజిస్ట్ డాక్టర్. శ్వేతా రాంపల్లి మాట్లాడుతూ… ఇటీవలకాలంలో చిన్న పిల్లల్లో అనేక రకాలైన న్యూరో సమస్యలను చూస్తున్నామని అన్నారు. ఫిట్స్, అరుదైన న్యూరో సమస్యలకు విజయంతగా చికిత్స అందించామని తెలిపారు. రిహాబిలిటేషన్ లో డాక్టర్. అజర్, మెగావతి కీలక పాత్రపోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిహాబిలిటేషన్ లో చికిత్స పొందిన చిన్నారులు చేసిన డాన్సులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.