NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దుగ్గిరాలలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై రిలే నిరాహార దీక్ష..

1 min read

– వైసీపీ ప్రభుత్వానికి చమర గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..

– మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దుగ్గిరాలలో  ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్ష 26వ  రోజు కొనసాగుతుంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి వచ్చాడు కాబట్టి ఎలాగైనా చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించి ఆ మచ్చ నీ మీద కూడా ఉంది అని చెప్పటం కోసమే ఒక కుట్ర పూర్తిగా చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్యను ఒక టిడిపి ప్రభుత్వమే కాకుండా పలు దేశాల్లో ఉన్న అనేకమంది విద్యార్థులు అనేకమంది ప్రజలు ముక్తకంఠతో ఖండిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి వారి ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి.టిడిపి నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ కేసులు పెట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టి నాయకులను బయటికి రానికుండా జైల్లో పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో వైసిపి ప్రభుత్వం దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని మీడియా  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారీగా తెలుగు తమ్ముళ్లు ఆడపడుచులు  తదితరులు పాల్గొన్నారు.

About Author