నవంబర్ నెల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల తేదీలు ఖరారు!
1 min read
పల్లెవెలుగువెబ్, తిరుపతి: నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల చేసే తీదీలను తితిదే బుధవారం ఖరారు చేసింది. ఈమేరక ఈనెల 22న ఉదయం 9గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు, 23న ఉదయం 9గంటలకు సర్వదర్శన టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కట్లు 12వేలు, సర్వదర్శన టిక్కెట్లు 10వేలు చొప్పున నవంబర్ నెలకు కేటాయించినట్లు పేర్కొంది.