NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సరెండర్ లీవ్ ల 554 కోట్ల రూపాయలు విడుదల..

1 min read

– 60 వేల పోలీస్ కుటుంబాలలో ఆనందం..

– ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేసిన రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం నాయకులు..

పల్లెవెలుగు వెబ్​ ఏలూరు :  రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కలసి ఒక్కసారిగా రావలసిన మూడు సరెండర్ లీవ్ లకు సంబంధించి 554 కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేసి 60 వేల మంది పోలీసు కుటుంబాలలో ఆనందం నింపినటువంటి ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే 60 వేల మంది పోలీస్ సిబ్బందికి రావలసినటువంటి వివిధ అలవెన్సులు , డిఏ బకాయిలు మరియు సర్వీస్ మేటర్స్ గురించి త్వరలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని అతి తొందరలో మన ఆర్థిక సమస్యలు సర్వీసుపరంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం  స్వయంగా తెలియపరిచారు . అందుకు 60 వేల మంది పోలీస్ సిబ్బంది  సీఎం జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలియజేశారు.

About Author