కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికల విడుదల
1 min read
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : చాగలమర్రి పట్టణంలోని వాసవీ కళాశాల ఆవరణలో ఈనెల 25వ తేదీన నిర్వహించబోయే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రిలను సోమవారం విడుదల చేశారు. పట్టణంలోని ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు స్వగృహంలో కల్యాణ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల సమక్షంలో ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 25న పెద్దఎత్తున నిర్వహించే వెంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకలను తిలకించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కార్యనిర్వహక కమిటీ సభ్యులు తోటసురేష్, కైపా నరసింహశాస్త్రి, నాగభూషణం, లోకేష్, భార్గవరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.