NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

20న పాలీసెట్ – 2023 ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

1 min read

– రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్ – 2023) ఫలితాలను  20వ తేది శనివారం విడుదల చేయనున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక, నైపుణ్యాభివృద్ధి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాల విడుదల జరుగుతుందన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి 2023-24 విద్యా సంవత్సరానికి సంభందించి రాష్ట్రంలోని  ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి పాలిసెట్ – 2023 పరీక్ష నిర్వహించగా 1,43,625 మంది హాజరయ్యా రన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశానికి సంబందించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వివరాలను సైతం అదే రోజు ప్రకటిస్తామన్నారు. ఫలితాలు, ర్యాంకుల వివరాలను ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల అనంతరం https://polycetap.nic.in URL నుండి పొందవచ్చని                                                                    చదలవాడ నాగరాణి వివరించారు.

           .

About Author