PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రగతి నివేదిక విడుదల

1 min read

– అభ్యర్థులను బేరీజు వేసుకుని ఓటు వేయండి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారి ఆరు సంవత్సరాల పనితీరుకు సంబంధించి ప్రగతి నివేదికను విడుదల చేసినట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న, జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి తెలియజేశారు. ఈ మేరకు తేదీ 27-02-2023న కర్నూలు నగరం నందలి సలాం ఖాన్ ఎస్టీయూ భవనం నందు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారి ప్రగతి నివేదిక విడుదల సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు ఈ సన్మూర్తి, రాష్ట్ర కార్యదర్శి సి.నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి టికె. జనార్దన్, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఐ. రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకొని ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు ,ఉపాధ్యాయ సంఘం నాయకుడు, సుదీర్ఘ అనుభవము ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ శ్రీ కత్తి నరసింహారెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ఆరు సంవత్సరాలుగా శాసనమండలిలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారు అనేక విషయాల పైన చర్చించినటువంటి వీడియోలు సాధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయని సూచించారు. గత ఆరు సంవత్సరాలుగా శాసనమండలిలో జాతీయ విద్యా విధానం పైన, మూడు, నాలుగు, ఐదు, తరగతుల విలీనం పైన,, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల పైన చర్చించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా కత్తి నర్సింహారెడ్డి గారు విద్యార్థుల యోగక్షేమాల కోసం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో కూడా నిద్రించి విద్యార్థుల కష్టసుఖాలను తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయని, అంతేగాకుండా శాసనమండలిలో రైతుల యొక్క గిట్టుబాటు ధరకు, సంబంధించి, అదేవిధంగా వ్యవసాయ కూలీల దినసరి కూలీల, గురించి, కస్తూర్బా పాఠశాలల కనీస వేతన చట్టం గురించి, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 హెడ్ జీతాలు, పదోన్నతుల గురించి, మున్సిపల్ ఉపాధ్యాయుల డ్రాయింగ్ అధికారాలు భవిష్యనిధి సౌకర్యం గురించి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసునని తెలిపారు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగులు,ఉపాధ్యాయులు కార్మికులు, పెన్షనర్లకు, సంబంధించిన 11వ వేతన సవరణ బకాయిలు రాబట్టుటకై చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్, డిగ్రీ, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల సంక్షేమానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడని తెలియజేశారు. కరోనా సమయములో కూడా ఆరోగ్యం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కరోనా వల్ల మృతి పొందిన ఉపాధ్యాయుల కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యం నింపిన విషయం కూడా అందరికీ తెలుసని. కత్తి నరసింహారెడ్డి గారు గత ఆరు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉంటూ కూడా ఇప్పటికీ ప్రభుత్వం యొక్క ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ నీతిగా నిజాయితీగా, జీవిస్తున్నటువంటి వ్యక్తి అని ఎటువంటి అవినీతి మచ్చలేని వ్యక్తిత్వం ఆయనకే సొంతమని తెలియజేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయులు కాని వారు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రైవేటు స్కూలు కరస్పాండెంట్లు, ఎన్నారైలు,వ్యాపారస్తులు, పోటీ చేస్తున్నారని వీరందరినీ ఓడించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఉపాధ్యాయులందరూ ఎదురుచూస్తున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి సి.నాగరాజు, రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ సయ్యద్ ముదసిర్ అహమ్మద్, నాయకులు, వీర చంద్ర యాదవ్ ఈ రాముడు, సుంకన్న ,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author