PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. 16వ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 29 వరకు ఉంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జులై 2 నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అవసరమైతే పోలింగ్ వచ్చే నెల 18న జరుగుతుంది. వచ్చే నెల 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24తో ముగుస్తుంది. రహస్య బ్యాలట్ విధానంలో ఈ ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు హౌస్, రాష్ట్రాల శాసన సభల్లో పోలింగ్ జరుగుతుంది.

                                         

About Author