బొజ్జా దశరథ రామిరెడ్డి జుడిషియల్ కస్టడీ నుండి విడుదల
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: బొజ్జా దశరథ రామిరెడ్డిని జుడిషియల్ కస్టడీ నుండి విడుదల చేసిన సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏర్వ రామచంద్రారెడ్డి అధ్యక్షతన గురువారం జనవరి 4 తేదీ నంద్యాల సమితి కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ హక్కుల సాధన దిశగా చేస్తున్న కార్యక్రమాలలో తన్ను అరెస్టు చేసిన సందర్బంగా రాయలసీమ వివిధ ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు చేపట్టి సంఘీభావం తెలియజేసిన రాయలసీమ ప్రజా సంఘాలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా నంద్యాల శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు ఎన్ ఎమ్ డి ఫరూక్, మూలింటి మారెప్ప, మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానంద రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నంద్యాల పార్లమెంటు తెలుగుదేశం ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మోహన్ రావు, వైఎస్ఆర్సిపి నాయకులు రాజగోపాల్ రెడ్డి, సిపిఎం రైతు సంఘం నాయకులు రాజశేఖర్, సిపిఐ పార్టీ రైతు సంఘం నాయకులు బాబా ఫక్రుద్దీన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, అడ్వకేట్ శంకరయ్య, వివాద రైతు సంఘాల నాయకులు, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.రాయలసీమ సాగునీటి మరియు ఇతర మౌళిక వసతుల కోసం రాజకీయాలకు అతీతంగా రైతు సంఘాల పోరాటాన్ని గుర్తించి, కొనియాడిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇప్పటికైనా తాత్కాలిక కలెక్టరేట్ ను తక్షణమే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి తరలించి, భారతదేశంలో గుర్తింపు పొందిన నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిరక్షించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు రాజ్యాంగబద్ధంగా బచావత్ ట్రిబ్యునల్ మరియు రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులను భంగం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6, 2023న తెచ్చిన చీకటి చట్టాన్ని వ్యతిరేకించే దిశగా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకుపోతానని, తనకు సంఘీభావం తెలియజేసే సందర్భంగలో నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి హామీ ఇచ్చినందకు, శిల్పాకు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా రాయలసీమ కీలకమైన అంశాలను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టేలాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతామని హామీ ఇచ్చిన మాండ్ర శివానందరెడ్డి, భూమా బ్రహ్మానంద రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాయలసీమకు కీలకమైన సమస్యల పరిష్కారానికి మరియు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన విషయాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకొని పోతామని హామి ఇచ్చిన నంద్యాల పార్లమెంటు కాంగ్రెస్ ఇన్చార్జి మోహన్ రావు కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పత్రిక సమావేశంలో బొజ్జా దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సాగునీటి హక్కులకు మరీ ముఖ్యంగా రాయలసీమ సాగునీటి హక్కులకు విఘాతం కలిగిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6న తీసుకుని వచ్చిన చీకటి చట్టం రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుండి పోరాడాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టం రద్దుకు తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల రిజర్వాయర్, తుంగభద్ర వరద కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకం, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణాలను చేపట్టే లాగా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాలను తమ మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని, ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యాచరణ ప్రకటించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ నిధులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వము కృషి చేయాలని మరియు అన్ని రాజకీయ పార్టీలు కార్యచరణ ప్రకటించాలని కోరారు. రాయలసీమలో చెరువులు అభివృద్ధి పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరారు.ఈ సమావేశంలో సమితి ఉపాద్యక్షులు వై.యన్.రెడ్డి, యాగంటి బసవేశ్వర రైతు సంఘం నాయకులు M.C.కొండారెడ్డి, గడివేముల మండల రైతు నాయకులు ఈశ్వర్ రెడ్డి, సౌదాగర్ ఖాసీం మియా, కుందూ పరిరక్షణ సమితి నాయకులు రామచంద్రారెడ్డి, పట్నం రాముడు, భాస్కర్ రెడ్డి, కొమ్మా శ్రీహరి, తిరుపాల్ యాదవ్, మహిపాల్ రెడ్డి, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.