ఉక్రెయిన్ లో చదివిన వైద్య విద్యార్థులకు ఊరట !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‍లో చదువుకున్న వైద్య విద్యార్థులకు భారత ప్రభుత్వం ఊరటనిచ్చింది. యుద్ధం కారణంగా చదువు ఆగిపోయిన విద్యార్థులకు ఉపశమనమిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 కన్నాముందు మెడిసిన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్‌కు కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్లు జారీ చేసింది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష(ఎఫ్‌ఎంజీఈ) రాసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో అర్హత సాధించిన వారు రెండేళ్లపాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.