లోకహితమే మతం కావాలి…
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ నేడు: లోకహితమే మతం కావాలని, లోక హితాన్ని కాంక్షించని ఏ మతం కూడా సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదని, అందుకే సనాతన ధర్మం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా లోకా సమస్తా సుఖినోభవంతు అనే ద్యేయ వాక్యంతో పనిచేస్తుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం, చిన్నకంబలూరు గ్రామంలోని శ్రీ రామాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. వాసాపురం వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చకులు వారణాసి గోపి శర్మ, మహిళలకు ఆచారాలు వ్యవహారాలు గురించి విపులీకరించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు పెనమడి వెంకట కృష్ణా రెడ్డి, హెచ్.వి. రమణారెడ్డి, దుత్తల శివారెడ్డి, గాజులపల్లి శ్రీనివాసులు, పాణ్యం కేశవరెడ్డి, మునగాల పుల్లారెడ్డి, జంగా భాస్కర రెడ్డి, ఎడవల్లి నాగేశ్వరరావు, నాగేశ్, తలారి వెంకట రమణ, చాకలి నాగయ్యతో టీచర్ నరసింహయ్య, అధ్యాపకులు గాయిత్రి, వై. ప్రసాద్, తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
