రాఘవరాజు పల్లెలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొలిమిగుండ్ల మండలం, రాఘవరాజు పల్లె గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నందు ఐదు రోజుల ధార్మిక కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు స్థానిక భజన మండలిచే భజనలు, మూడు రోజులపాటు జయదేవానంద స్వామిచే ధార్మిక ప్రవచనాలు, శుక్రవారం ముక్కోటి దేవతా స్వరూపమైన గోపూజ మరియు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. మొదటి రోజు శ్రీమద్రామాయణం విశిష్టతపై ప్రవచనం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎ.ఎరికెల రెడ్డి, ఎ.ఆదిరెడ్డి, ఎ.నారాయణ రెడ్డి, ఎ.గంగిరెడ్డి, ఎ.సాయి ప్రతాప్ రెడ్డి, బి. రాంబాబు, బి. రఘురామయ్య, బి. దస్తగిరి, ఎస్.శివాంజనేయులు, ఒ.రామసుబ్బయ్య, ఎ. భాస్కర్ రెడ్డి, ఎ. బాల నాగిరెడ్డి, ఎ. వెంకట్రామిరెడ్డి, ఒ.వెంకట సుబ్బయ్య, ఎస్.రామ్ కుమార్, టి.శ్రీనివాసులు, బి.బాల భూషణ్, యం.శ్రీనివాసులు, ఒ.శ్రీనివాసులు, యం.గోపాల్ రెడ్డి, ఎ.జనార్థన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.