NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి అభ్యర్థి రోషన్ కుమార్ కు అశేష జనాధారణ..

1 min read

కూటమి నాయకులతో కలిసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామ అధ్యక్షులు పాతురి శ్రీనివాసరావు,మండల అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్న టిడిపి,జనసేన,బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఆయనకు మండలంలో మహిళలు టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పూలమాలలు జల్లి స్వాగతించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలకు పెద్దపీట వేసిన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలన్నదే మన ఆశయం అన్నారు. బిజెపి. జనసేన కూటమితో మీ అందరి సహకారంతో స్థానికుడనైన నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతోనే శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నానని నియోజక వర్గంలో ప్రతి సమస్యపై అవగాహన కలిగి ఉన్నానని గత కొన్ని సంవత్సరాలుగా మండల, గ్రామస్థాయిలో తిరిగి సేవా కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author