మసీదులో ఆలయ అవశేషాలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : జ్ఞానవాపి మసీదు సర్వే రిపోర్ట్‌ని గురువారం వారణాసి కోర్టుకు ప్రత్యేక సర్వే కమిటీ అందించింది. సర్వేకి సంబంధించిన వీడియోని సీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు సమర్పించారు. కాగా, ఈ సర్వేలో సంచలన విషయాలు వెల్లడి అయినట్లు తెలుస్తోంది. మసీదులో ఆలయ అవశేషాలు ఉన్నట్లు కమిటీ నిర్ధారించిందట. విగ్రహాల ముక్కలు ఉన్నాయని, మసీదు గోడలపై హిందూ రాతలు ఉన్నాయట. గోడలపై కమలం గుర్తులు, హిందూ దేవతలకు సంబంధించిన బొమ్మలు కనిపించినట్లు కమిటీ పేర్కొంది. కాగా, మసీదు మొత్తాన్ని పురావస్తుశాఖ సర్వే చేయాలని డిమాండ్ లేవనెత్తింది.