రేమట రోడ్డు నిర్మాణం పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి
1 min readఆర్&బి ఈ.ఈ సురేష్ బాబును కోరిన ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మండలంలోని రేమట గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టారని అయితే ఉల్చాల నుండి రేమట మధ్య రోడ్డు రెండు కిలోమీటర్ల మేర పెండింగ్ ఉందని దానిని పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని రోడ్డు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు సురేష్ బాబును రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్,జిల్లా అధ్యక్షులు అశోక్ నేడు కోరారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు మండలంలోని రేమట గ్రామానికి గత నెల రోడ్డు నిర్మాణం చేపట్టడం ఆనందదాయకమని అయితే గతంలోనే గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయిన కారణంగా అప్పటి టెండర్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టారని అందువలన రోడ్డు కొంతమేర పెండింగ్ పెట్టారని పెండింగ్ లో ఉన్న రెండు కిలోమీటర్ల మేర రోడ్డు తీవ్ర గుంతలతో గ్రామ ప్రజలు రవాణాకు అంతరాయం ఏర్పడుతుందని కావున తక్షణమే పెండింగ్ పెట్టిన రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రోడ్డు భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు సురేష్ బాబును కోరమని పెండింగ్ ఉన్న రోడ్డు నిర్మాణం కొరకు ప్రభుత్వానికి,పై అధికారులకు నివేదిక పంపిస్తామని త్వరలోనే పూర్తికాని రోడ్డు నిర్మాణం పనులు చేపడతామని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ కు రోడ్డు భవనాల శాఖ కార్యనిర్వాక ఇంజనీర్ సురేష్ బాబు తెలిపినట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు వసంత్ కుమార్,విజయ్ పాల్గొన్నారు.