రేమట గ్రామానికి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలి..
1 min readరేమట గ్రామ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే చలో అమరావతికి పిలుపునిస్తాం
ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మండలంలోని రేమట గ్రామానికి తక్షణమేరోడ్డు నిర్మాణం చేపట్టాలని కర్నూలు నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో ఎస్.ఈ నాగరాజును రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్,ఆర్వీపీఎస్ జిల్లా అధ్యక్షులు అశోక్ లు కలిసి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు మండలంలోని రేమట గ్రామానికి రోడ్డు పూర్తిగా పాడైపోయి మోకాళ్ళ లోతు గుంతలు ఏర్పడి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిన అధికారులు ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు గ్రామానికి అంబులెన్స్ సైతం రావడంలేదని రోడ్డు ప్రయాణంలో ప్రమాదాలు జరిగి గ్రామ ప్రజలు మరణించిన ప్రజా ప్రతినిధులు అధికారులు చూసి చూడనట్లు ఎందుకు వివరిస్తున్నారని ఈ విషయమై అనేకసార్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ లను కలిసి విన్నవించిన నిధులు రాలేదన్న కారణంతో రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని చెబుతున్నారని రోడ్డు పూర్తిగా పాడైపోయి మూడున్నర సంవత్సరాలు గడిచిన ఇంకా నిధుల సాకుగా చూపిస్తూ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం దారుణమని ఆయన అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే గ్రామస్తులమంతా కలిసి చలో అమరావతికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వసంత్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.