NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కళాకారులు దాసరి రంగముని జ్ఞాపకార్థం సంస్మరణ సభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కళాకారులు కందుకురి విశిష్ట అవార్డు గ్రహీత దళిత రత్న దాసరి రంగముని జ్ఞాపకార్థం రేపు అనగా శనివారం ఉదయం 10 గంటలకు మద్దూరు నగర్ నందలి సూరన్న తెలుగు తోట నందు సంస్మరణ సభ కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుర్రపుసాల అంకయ్య అధ్యక్షతన జరుగును. దాసరి రంగముని అభిమానులు ఈ సంస్మరణ సభా కార్యక్రమానికి తప్పక హాజరు కాగలరని హృదయపూర్వక ఆహ్వానం పలికారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శిగా దాసరి రంగముని అందరికీ సుపరిచితులే రంగస్థల కళాకారులను తీర్చిదిద్దుటలో ఎంతో సహకరించిన సంగీత గురువు దాసరి రంగముని జ్ఞాపకార్థం ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి పి హనుమంతరావు చౌదరి గారు ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నారు. కావున కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు కళాభిమానులు తప్పక ఈ సంస్కరణ సభకు హాజరు కావలసినదిగా కార్యనిర్వాహక కార్యదర్శి బైలుప్పల షఫీయుల్లా మనవి చేయుచున్నారు.

About Author