మమ్మీ చేతిలో రిమోట్.. డమ్మీ చేతిలో పాలన !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాహుల్ ఏ హోదాలో తెలంగాణకు వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఔట్‌డేటెడ్ పార్టీ అని, సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్‌ను గౌరవించలేని వ్యక్తి రాహుల్ అంటూ దుయ్యబట్టారు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవ్వరిదని ప్రశ్నించిన కేటీఆర్.. మమ్మీ చేతిలో రిమోట్ ఉంటే, డమ్మీ చేతిలో పాలన ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అంటేనే స్కాం పార్టీ, కాంగ్రెస్ ఆలిండియా అలిగేషన్ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు.