NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్మశానంలో కంపచెట్లు తొలగింపు

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు :  చెన్నూరు హిందూ స్మశాన వాటికకు వెళ్లే దారి కంపచ్చేట్లతో, పిచ్చి మొక్కలతో నిండిపోడంతో ఆఖరి మజిలీకి వెళ్లేందుకు చెన్నూరు వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి నాయకులు అందరు కలసి కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో అయన వెంటనే సహృదయంతో స్పందించి శనివారం తన సొంత నిధులతో స్మశానం వెళ్లే దారి లో ఉన్న కంప చెట్లు, పిచ్చి మొక్కలు జెసిబి సహాయంతో తొలగించడంతోపాటు, అక్కడ గుంతలు మొత్తం డోజర్ సహాయంతో పూడ్చి వేయడం జరిగిందని వైయస్సార్ సిపి నాయకులు తెలిపారు, గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఆయన ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా జరిగిందని వారు తెలియజేశారు, అంతేకాకుండా ఆయన సొంత నిధులు వెచించి ఎక్కడ ఏ ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగిందని వైఎస్ఆర్సిపి నాయకులు తెలియజేశారు, ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం పట్ల మండల ప్రజలు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పెడబల్లె జయభారత్ రెడ్డి, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ అల్లి శ్రీ రామ్మోర్తీ బిసి సీనియర్ నాయకులు రామాంజులు, రాముడు సచివాలయ కన్వీనర్ రమేష్ రెడ్డి , మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

About Author