పెన్నా కేసు నుంచి తొలగించండి
1 min readపల్లె వెలుగు వెబ్ : ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. పెన్నా కేసులో సీఎం జగన్ డిశ్చార్జీ పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా చార్జిషీట్ నుంచి తనపేరు తొలగించాలని జగన్ కోరారు. పెన్నా చార్జిషీట్ నుంచి తనపేరు కూడ తొలగించాలని తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కూడ డిశ్చార్జీ పిటిషన్ దాఖలు చేశారు. సబిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. దీంతో విచారణను సీబీఐ కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్ల పై కూడ విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈనెల 28కి పడింది.