NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నంద్యాల టీడీపీ అధ్యక్షుడి పై రౌడీ షిట్ ఎత్తివేయాలి …. 

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్ : టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పై ఓర్వకల్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షిట్ ఓపెన్ చేసినట్టు హుసేనాపురం టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తూ రాజశేఖర్ పై తెరిచిన రౌడీ షిట్ తొలగించాలని ఓర్వకల్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున  ఇరవై నిముషాలు రహదారిని దిగ్బందించారు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఓటమి ఖాయమైందని భయపడి స్థానిక ఎమ్మెల్యే అధికారులు కుమ్మకై తమ నేతపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపించారు ఎన్నికలలోపు మండలంలో టిడిపికి ప్రధాన పోలింగ్ ఏజెంట్ లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని  ఓర్వకల్ ఎస్సై రాజారెడ్డి టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి ధర్నా విరామింప చేశారు.

About Author