మహిళల బొమ్మల తలలు తీసేయండి !
1 min readపల్లెవెలుగువెబ్ : అప్ఘానిస్థాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం స్థానికంగా బట్టల షాపుల్లో ఉన్న ప్లాస్టిక్ మహిళల బొమ్మల తలల్ని తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళల ప్లాస‍్టిక్ బొమ్మలు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న బట్టల షాపు యజమానులకు షాపుల్లో ఉండే మహిళ బొమ్మల తలలను నరికేయాలని ఆదేశించారు. ఇది (ఇస్లామిక్) షరియా చట్టానికి విరుద్ధం. కాబట్టి మహిళల ప్లాస్టిక్ బొమ్మల తలల్ని కత్తిరించాలని షాపుయజమానులకు ఆదేశాలు జారీ చేసింది.
x