రోడ్డు వేయని అధికారులను తొలగించండి..
1 min read
49 బన్నూరు రహదారిని బాగు చేయండి..
పల్లెవెలుగు , మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామ దళిత వాడలో మెయిన్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ఎం సీపీఐ యు పార్టీ జిల్లా కన్వీనర్ పి. రాజరస్ డిమాండ్ చేశారు. శనివారం గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రధాన రహదారిని వారు పరిశీలించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఓర్వకల్లు నుండి చౌట్కూరు,49 బన్నూరు మీదుగా మిడుతూరు, నందికొట్కూరుకు మరియు బేతంచర్ల,కోవెలకుంట్ల, నంద్యాల వెళ్లాలంటే ఈ వాహనాలు ప్రయాణికులు ఈ రోడ్డు మార్గాన్నే వెళ్తూ ఉన్నారని 4 కోట్లతో రోడ్డు వేయాలని ప్రభుత్వం టెండర్ వేయగా కాంట్రాక్టర్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల 49 బన్నూరు,చౌట్కూరు, గుడిపాడులో ఆటో స్టాండ్ రోడ్డు అద్వానంగా ఉన్నాయని రహదారిలో రోడ్డు వేయనందున భారీ వాహనాలు వెళ్లడం వలన దుమ్ము ధూళితో దళితులు సుమారు 5 మంది చనిపోయారని దళిత వాడలో నేటికీ వివక్షత చూపుతున్నారని రోడ్డు వేయని అధికారులు కాంట్రాక్టులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కాంట్రాక్టు లైసెన్స్ రద్దు చేసి అరెస్టు చేసి తక్షణమే దళిత వాడలో సీసీ రోడ్డు వేయాలని లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.రోడ్డు వేయని అధికారులను వెంటనే తొలగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు,మర్రి స్వామి,డక్క కుమార్,వాడాల శీను,కాలనీ వాసులు ఎల్లమ్మ మరియమ్మ అచ్చమ్మ పుల్లమ్మ లక్ష్మీదేవి వెంకట రాముడు స్వాములు పాల్గొన్నారు.