ముఖం నుంచి మొటిమల్ని ఇలా దూరం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్: ముఖం మీద మెటిమలతో ఎంతో మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా టీనేజీ అమ్మాయిలు, అబ్బాయిలు. ముఖం నుంచి మొటిమల్ని దూరం చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి రోజు నీళ్లు ఎక్కువగా తాగాలి. నూనె పదార్థాలు, వేయించిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. రోజులో కనీసం మూడు, నాలుగు సార్లు ముఖం కడుక్కోవాలి. కొంతమంది ఐస్‌క్యూబ్స్ రబ్ చేయడం చేస్తుంటారు. కానీ అది సరికాదు. గ్రేప్స్‌ను గుజ్జుగా చేసి ముఖంపై రబ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కీర, ఓట్‌మీల్, యోగర్ట్… ఈ మూడు కలిపి పేస్టులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తేనెను ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేసినా ఫలితం కనిపిస్తుంది. కలబంద ఉన్న జెల్ ఏదైనా ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలు పాటించడం ద్వార మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు.