కర్నూలులో.. జోయాలుక్కాస్ పున:ప్రారంభోత్సవం..
1 min readప్రారంభించిన మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యరంగంలో ప్రథమస్థాయిలో రాణిస్తున్న జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్ షోరూంను పున:ప్రారంభించడం అభినందనీయమన్నారు కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య. శనివారం కర్నూలు నగరంలో జోయాలుక్కాస్ గోల్డ్ షోరూంను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ బి.వై. రామయ్య మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ బంగారు డిజైన్లను అందజేయడం ప్రశంసనీయమన్నారు. అనంతరం జోయాలుక్కాస్ డిజిఎం(మార్కెటింగ్ ) అనిష్ వర్గేష్ మాట్లాడుతూ షోరూం పున: ప్రారంభోత్సవం సందర్భంగా డైమండ్ జ్యువెలరీ పై 25 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతోపాటు మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు కొనుగోలు చేసిన ప్రతి బంగారు వస్తువుపై గ్యారంటీగా ఉచిత బహుమతులు అందజేస్తున్నామన్నారు. ఆ తరువాత రిటైల్ మేనేజర్ రాజేష్ క్రిష్ణన్ మాట్లాడుతూ నాణ్యతలో ఏ మాత్రం తగ్గకుండా… బంగారు ప్రియుల ఆలోచనలకు తగ్గట్టు బంగారు డిజైన్లను ఆఫర్లతో విక్రయించడం జోయాలుక్కాస్ ప్రత్యేకత అన్నారు. కోట్లాది మంది బంగారు కొనుగోలుదారుల ఆదరాభిమానాలు పొందిన జోయాలుక్కాస్… మరెన్నో ఆఫర్లతో కర్నూలు ప్రజల ముందుకు వచ్చిందని, ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో షోరూం సిబ్బంది, కొనుగోలుదారులు ఉన్నారు.