NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్పంచ్ ఆధ్వర్యంలో తాగునీటి బోరుకు మరమ్మతు

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండల పరిధిలోని మట్లి పంచాయితీ ఉన్న బోడిమల్ రెడ్డి గారి పల్లి లో వున్న త్రాగునీటి బోరు మరమ్మతులకు గురి కావడంతో స్థానిక ప్రజలు గ్రామ సర్పంచ్ సోమారపు నాగార్జునాచారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన సర్పంచ్ ఆదివారం మోటార్ ను బిగించి నీటి సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొడిమల్ రెడ్డి గారి పల్లి కి చెందిన స్కీమ్ బోరు నెల వ్యవధిలోనే రెండు సార్లు మరమ్మత్తులకు గురైందని తెలిపారు.గత కొద్దిరోజుల క్రితం పాడవడంతో రిపేర్ చేయించామన్నారు. మళ్ళీ పాడయినందున గ్రామస్థుల కోరిక మేరకు రిపేర్ చేయించడం జరిగిందన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్నా తమ దృష్టికి వచ్చిన వాటిని తమ బాధ్యతగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. సీజనల్ వ్యాధుల ప్రభావం అధికమవడంతో గ్రామాలలో అపరిశుభ్రత వున్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ ను చల్లిస్తున్నామని, అంతే కాకుండా శుభ్రత పట్ల అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

About Author