పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతులు చేపట్టండి
1 min read
లీకేజీ ఏర్పడితే స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వాలి
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరంలో పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడితే జాప్యం చేయకుండా వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వీకర్ సెక్షన్ కాలనీ, పెద్దపాడు రహదారి ప్రాంతాల్లో పైప్‌లైన్ లీకేజీలను పరిశీలించారు. వేసవి కాలం ప్రారంభమైనందున తాగునీటి వృథా అరికట్టాలని, నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవాలని కమిషనర్ అధికారులను సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగరంలో పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడితే అక్కడి స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని, నీటిని పొదుపుగా వాడుకుంటూ, నీటి వృథాను అరికట్టేందుకు సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. కార్యక్రమంలో డిఈఈ నరేష్, ఏఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వర్క్ ఇంస్పెక్టర్ కేశవ్, తదితరులు పాల్గొన్నారు.