NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెప్కో బ్యాంక్ ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : బ్యాంక్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. రెప్కో బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్వి డుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్కోసం దరఖాస్తు చేయడానికి.. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 నవంబర్ 2022గా నిర్ణయించబడింది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్‌లో 50 జూనియర్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అభ్యర్థులు రూ. 900 ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17,900 నుండి రూ.47,920 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడుతుంది . 2 గంటల వ్యవధిలో 200 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

About Author