PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ రాజ రాజేశ్వరి ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు  వెబ్ గడివేముల : గడివేములలోని శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో జనవరి 26, 75వ గణతంత్ర దినోత్సవంను ఘనంగా జరుపుకున్నాము. గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాల   కరస్పాండెంట్  శ్రీ ఎం. రామేశ్వర రావు  పతాక ఆవిష్కరణ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి  కరస్పాండెంట్ శ్రీ ఎం. రామేశ్వర రావు  మాట్లాడుతూ , భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నుండి అమలులోనికి వచ్చిందని. అప్పటినుండి భారతీయులందరూ 1950 జనవరి 26 న గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నామన్నారు  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం ఈ ముసాయిదా లెజిస్లేటివ్ కౌన్సిల్ సమర్పించబడింది.  26 నవంబర్ 1949 న ఆమోదించబడినది. కానీ 26 జనవరి 1950 నుండి అమలులోనికి వచ్చిందనీ. భారతదేశం స్వాతంత్రం పొందడంలో భారత రాజ్యాంగమును అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన దేశ నాయకులను  కూడా ఈ రోజు మనం స్మరించుకుంటామన్నారు వారి కారణంగానే భారతదేశం నేడు గణతంత్ర రాజ్యంగా పిలవబడుతుందన్నారు. మన గొప్ప భారతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు మొదలైన వారు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు.  రిపబ్లిక్ డే గురించి విద్యార్థులకు పూర్తి వివరణ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల స్పీచ్ లు నృత్యాలు ఆటలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు. తర్వాత ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీ ఎం. రామేశ్వర రావు , ఏవో ఎం.బి.యన్. రాఘవేంద్రరావు , ఎం. క్రిష్ణకాంత్  ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని గణతంత్ర దినోత్సవ కార్యక్రమమును విజయవంతం చేశారు. చివరగా జాతీయ గీతం “జనగణమన”తో కార్యక్రమం ముగిసింది.

About Author