NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి : గురువారం జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపి మిథున్ రెడ్డి, వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం, జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమర నాధ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి, ఏ పి ఎం డి సి చైర్మన్ షమీమ్ అస్లం,జిల్లా కలెక్టర్ గిరీష, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, ఎస్ పి హర్షవర్ధన్ రాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. నేతలు,అధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నవరత్న పథకాల శకటాల ప్రదర్శనలు ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాల పంపిణీ లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి మిథున్ రెడ్డి, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం , జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి లు మాట్లాడుతూ అందరిలో దేశభక్తి ఉప్పొంగేలా నూతన జిల్లాలో ఘనతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా… కన్నుల పండువగా జరగడం హర్షణీయమన్నారు. దేశభక్తి ఉప్పొంగేలా పోలీసుల కవాతు, విద్యార్థులు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం అనిర్వచ నీయమన్నారు. శకటాల ప్రదర్శన, 687 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాల పంపిణీ,అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఎగ్జిబిషన్ స్టాల్ల్స్ ఏర్పాట్లు, అర్హులైన లబ్దిదారులకు వాహనాలు, ఆస్తుల పంపిణీ కార్యక్రమాలును అధికారుల బృందం చాలా చక్కగా నిర్వహించడం పై అధికారులను, సిబ్బందిని నేతలు ప్రశంసించారు.

About Author