సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని తాసిల్దార్ కు వినతి
1 min read
జై భీమ్ యువత ఫౌండేషన్
పల్లెవెలుగు, పత్తికొండ: ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని జై భీమ్ యువత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తాసిలర్ రమేష్ కు వినతి పత్రం అందజేశారు. ప జై భీమ్ యువత ఫౌండేషన్ అధ్యక్షులు ఆవుల సోమన్న, ఉపాధ్యక్షులు ముని స్వామి ఆధ్వరంలో ఎమ్మార్వో రమేష్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆవుల సోమన్న మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ప్రజలకు, విద్యార్థులకు, యువతకు సూపర్ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు పూర్తయినప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు.అమ్మకు వందనం 15,000, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3,000, అన్నదాత సుఖీభవ 20,000 మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు. 1500, ప్రతి ఇంటికి ఎడాదికి 3. ఉచిత సిలిండ ర్లు పంపిణీ ఇలాంటి ప్రజాకర్షక పథకాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని తెలిపారు.ఇవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా హోటల్ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల జై భీమ్ యువత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యువత ఫౌండేషన్ నాయకులు హాజి,అవినాష్, సతీష్, సవారి, తదితరులు పాల్గొన్నారు.