వినతులను తక్షణమే పరిష్కరించాలి : ఎమ్మెల్యే
1 min read–గడపగడపకు మన ప్రభుత్వం 50 రోజులు విజయవంతం
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఏలూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడపగడపకు వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని. కాలయాపన చేయకుండా వారికి వారి యొక్క అవసరాలు తీర్చే విధంగా మనమంతా పనిచేయాలని సూచించారు, కొంతమంది అధికారులు నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు చేరువగా మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ సూచనలు సలహాలు అందించాలని అన్నారు,ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన వినతుల గురించి చర్చించి,వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా మాజీ కేంద్ర సహాయ మంత్రి, సినీ నటుడు యు వి కృష్ణంరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు, కార్యక్రమంలో ఏలూరు ఎంపీపీ పెన్మచ్చ శ్రీనివాసరాజు,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు,జడ్పిటిసి మండల సరస్వతి కొండలరావు,ఎంపీపీ తాతా రమ్య ,ఏం సి చైర్మన్ మేక లక్ష్మణరావు,దెందులూరు నియోజకవర్గం సంబంధిత అధికారులు, జడ్పిటిసిలు,ఎంపీటీసీలు సర్పంచులు,వైసీపీ నాయకులు తేరా ఆనంద్,పళ్లెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.