PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళిత క్రైస్తవులకు… దళిత ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలి

1 min read

– రాష్ట్రపతి, ప్రధాని ఐక్యరాజ్య సమితి సారథ్యం లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పనపై రాజ్యాంగంలో సవరణ చేయాలి..

– బిషప్ జయరావు పొలిమేర

– అఖిలభారత క్రైస్తవ సమైక్య పిలుపు..

– 72 ఏళ్లుగా దళిత క్రైస్తవులు రిజర్వేషన్ కోల్పోతున్నారు..

– ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్   పి జీవన్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు రిజర్వేషన్ లు కల్పించాలని ఏలూరులో క్రైస్తవ సమాజం డిమాండ్ చేశారు. గురువారం ఉదయం అఖిల భారత క్రైస్తవ సమాఖ్య పిలుపు మేరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ ఇన్ ఇండియా, కతోలిక భారత పీఠాధిపతుల సమాఖ్య , నేషనల్ కౌన్సిల్ దళిత క్రిస్టియన్స్ సంఘాల సంయుక్త ఆద్వర్యంలో ఆర్ సి ఎం పీఠాధిపతి రెవరెండ్  బిషప్ జయరావు పొలిమేర నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్ సి ఎం పీఠాధి పతులు మోస్ట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు మాట్లాడుతూభారత రాజ్యాంగం ప్రకారం దళితులకు మాత్రమే రిజర్వేషన్ లు కల్పించి క్రైస్తవ మతము స్వీకరించిన దళితులకు రిజర్వేషన్ లు దక్కకుండా కేంద్ర ప్రభుత్వం ఏళ్ళ తరబడి తిరస్కరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాని నరేంద్ర మోడీ ఐక్య రాజ్య సమితి సారథ్యం లో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ల కల్పన పై  రాజ్యాంగంలో సవరణలు చేయాలని కోరారు. భారత రాజ్యాంగంలో 1950 లో భారత రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులతో 3వ పేరా ననుసరించి దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్ లను ఉద్దేశ పూర్వకంగా అందనీయకుండా కేంద్ర ప్రభుత్వం కక్షపూర్వకంగా తిరస్కరిస్తుందని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. దళిత బౌద్ధులకు, దళిత సిక్కులకు మాత్రం రాజ్యాంగం సవరించి దళిత రిజర్వేషన్ లు కల్పిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వానికి దళిత క్రైస్తవులపై పక్షపాత వివక్ష వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్, జనరల్ సెక్రెటరీ రెవ పి. జీవన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ నిర్లక్ష్య క్రైస్తవ మత వ్యతిరేక దౌర్భాగ్య పరిస్థితుల వల్ల దళిత క్రైస్తవులు 72 ఏళ్లుగా దళిత రిజర్వేషన్ లు కోల్పోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులు ఏలూరు బిషప్ హౌస్ నుండి కలక్టరేట్ వరకు భారీ నిరసన తెలుపుతూ వేలాది మంది దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలతో కలిసి నిరసన పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికైనా 1950 లోరాష్ట్రపతి దళిత క్రైస్తవులకు విరుద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులతో 3 వ పేరాను సవరించిదళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు దళిత రిజర్వేషన్ లు కల్పించాలని, భారత  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , భారత ప్రధాని నరేంద్ర మోడీ ని కోరుతూ రాసిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ ను కలిసి ఆర్ సిఎం పాదర్ లు, ముస్లిం పెద్దల బృందం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రెవ.ఇ.రత్న ప్రసాద్, సెక్రటరీ రెవ.జోసెఫ్ చిక్కాల, ఫాదర్ జి మోజెస్, ఫాదర్ మైకేల్ ,ఫాదర్ తోట ఆంథోనీ,నగర కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథం,రెవ. విజయానంద్ , రెవ.కిరణ్ పాల్ ,రెవ.ఆర్ జయరాజు , రెవ.వి రాజ్ కుమార్, దళిత నాయకులు పొలిమేర హరికృష్ణ , మేతర అజయ్ బాబు పలువురు దైవజనులు పాల్గొన్నారు.

About Author