NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగాల్లో హిజ్రాల‌కు రిజ‌ర్వేష‌న్లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌భుత్వ కార్పొరేష‌న్లు, మండ‌లి, సంస్థ‌ల్లో హిజ్రాల‌కు ఒక శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తింప‌జేయాల‌ని క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆదేశాల అమ‌లుకు ప్ర‌భుత్వానికి రెండువారాల అవ‌కాశం ఇచ్చింది. సంగ‌మ స్వ‌యం సేవా సంస్థ దాఖ‌లు చేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. మ‌రోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ -2021 కోసం ఇచ్చిన నోటిఫికేష‌న్లో ప్ర‌త్యేక రిజ‌ర్వ్ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ పోస్టుల‌కు హిజ్రాలు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని క‌ర్ణాట‌క పోలీసు శాఖ ప్ర‌క‌టించింది.

                                    

About Author