అగ్రవర్ణాల రిజర్వేషన్లు రద్దు చేయాలని… 21న కలెక్టరేట్ ముట్టడి
1 min read– బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిసె శివన్న
పల్లెవెలుగు వెబ్: దేశ జనాభాలో 56 శాతం పైగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉంటే… అగ్రవర్ణాల వారు 15శాతం మాత్రమే ఉన్నారని …వారికి పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిసె శివన్న. అగ్రవర్ణాపల్లో 5 శాతం భూస్వాములు, కుబేరులు ఉండగా 10శాతం మాత్రమే మధ్య తరగతి కుటుంబీకులు ఉన్నారని, అలాంటి వారికి ఈడబ్ల్యూఎస్ 10 శాతం కేఏటాయిస్తే దేశభవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలకు 50శాతం కేటాయిస్తే దేశానికి గొప్ప నాయకుడు దొరికాడని, అప్పుడు ప్రజలందరూ గౌరవిస్తారన్నారు. దేశ భవిష్యత్, భద్రత రిజర్వేషన్లపై ముడిపడి ఉందన్న శివన్న… సోమవారం కలెక్టరేట్ ముట్టడికి బీసీలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.