AIMC లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
1 min readకాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జె.లక్ష్మి నరసింహ యాదవ్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఆల్ ఇండియా మెడికల్ కౌన్సెలింగ్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా పార్లమెంట్లో ప్రస్తావించాలని ని కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థియువజన సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జె లక్ష్మి నరసింహ యాదవ్ కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్కు విన్నవించారు. ఈమేరకు శనివారం ఎంపీకి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ మెడికల్ కౌన్సిలింగ్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కూడా ప్రధానమంత్రి లేఖ రాశారని గుర్తు చేశారు, 2017 నుండి రిజర్వేషన్లు లేకపోవడంతో… 11వేల మంది వైద్యవిద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు రెండు ఎంపీలు నీట్లో ఓబీసీల రిజర్వేషన్ల కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏప్రిల్లో ఢిల్లీ పర్యటన ఉంటుందని ఈ సందర్భంగా లక్ష్మి నరసింహ యాదవ్ వెల్లడించారు.