PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముగిసిన రిజర్వుబ్యాంక్​ ఎంపీసీ సమావేశం! జీడీపీ వృద్ధిరేటు పెరగొచ్చని అంచనా

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(ఆర్​బీఐ) మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశం శుక్రవారం ముగిసింది. మున్ముందు. రియల్​ గ్రాస్​ డొమెస్టిక్​ ప్రాడక్ట్​(జీడీపీ) వద్ధిరేటు పెరగొచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది. మూడురోజులపాటు కొనసాగిన పాలసీ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఎంసీపీ సమావేశంలో ఆర్థిక సంక్కరణలపై చర్చించడంతపాటు ఈఎంఐ, వడ్డీ రేట్ల విషయాలపై సమీక్షిస్తారు. ఈ క్రమంలో ఆర్​బీ మరోసారి రెపోరేటు యథావిధిగా 4శాతమే కొనసాగించడంతోపాటు రివర్స్​ రెపోరేట్​ సైతం 3.35శాతం యథావిధిగా ఉంటుందని పేర్కొంది. అలాగే మార్జినల్​ స్టాండింగ్​ ఫెసిలిటీ(ఎంఎస్​ఎఫ్​) రేట్​ కూడా స్థిరంగా 4.25శాతమే ఉంటుందని తెలిపింది. ఈ ఆర్థిక ఏడాది(2021–22)లో దేశ రియల్​ జిడీపీలో వృద్ధిరేటు 9.5శాతం ఉంటుందని అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 7.9శాతం, 3వ త్రైమాసికంలో 6.8, నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 6.1శాతం ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే 2022–23లో జాతీయస్థాయిలో రియల్​ జీడీపీ వృద్ధి రేటు 17.1శాతం ఉంటుందని ఆర్​బీఐ పేర్కొంది. ఇక 2022–23 ఆర్థిక ఏడాదిలో మొదటి త్రైమాసికంలో కన్జూమర్​ ప్రైజ్​ ఇన్​డెక్స్​(సిపీఐ) ద్రవ్యోల్బణం వృద్ధి 5.2శాతం ఉండొచ్చని సెంట్రల్​ బ్యాంక్​ అంచనా వేసింది.

About Author