PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగార‌కుడి పై నివాసం .. ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అంగార‌క గ్రహం లాంటి కృత్రిమంగా సృష్టించిన వాతావ‌ర‌ణంలో.. ఏడాది పాటు నివ‌సించేందుకు ఆస‌క్తి ఉన్న వారికి నాసా గొప్ప అవ‌కాశం క‌ల్పిస్తోంది. అలాంటి వాతావ‌ర‌ణంలో నివ‌సించే ఆస‌క్తి ఉన్నవారి నుంచి నాసా ద‌ర‌ఖాస్తులు ఆహ్వినిస్తోంది. ప్రస్తుతానికి అమెరికా పౌరులు, అక్కడ శాశ్వత నివాస హోదా ఉన్న వారే దీనికి అర్హులు. హ్యూస్టన్ లోని జాన్సన్ అంత‌రిక్ష కేంద్రంలోని ఓ భ‌వ‌నంలో ‘ మార్స్ డ్యూన్ ఆల్ఫా’ అనే ప్రత్యేక ఆవాసం ఉంది. దీని విస్తీర్ణం 1700 చ‌ద‌ర‌పు అడుగులు. త్రీడీ ముద్రిత విధానంలో సృష్టించిన ఈ ఆవాసంలో అంగార‌క గ్రహం త‌ర‌హా వాతావ‌ర‌ణం ఉంటుంది. అంగార‌కుడి పైకి వ్యోమ‌గామ‌లు పంపేందుకు ప్రణాళిక ర‌చిస్తోన్న నాసా .. అక్కడికి వెళ్లే వారికి శారీర‌కంగా, మాన‌సికంగా ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయో ముందుగా తెలుసుకోవాల‌ని నిర్ణయించింది. ప‌రిమిత వ‌న‌రులు, క‌మ్యూనికేష‌న్ డిలే, ప‌రిక‌రాల వైఫ‌ల్యం లాంటి స‌వాళ్లను ఎలా ఎదుర్కొంటార‌న్న దాని పై అధ్యయ‌నానికి సిద్ధమైంది. దీనికి ఉత్సహ‌వంతులైన అమెరికా పౌరుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. నలుగురిని ఎంపిక చేసి వారిని ఏడాది పాటు మార్స్ డ్యూన్ ఆల్ఫా లో ఉంచుతారు.

About Author