పశ్చిమాన.. ‘రెసిడెన్షియల్’ హాస్టల్‌ను ఏర్పాటు చేయండి
1 min read–వలస వెళ్లిన కుటుంబాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు
- జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు ఊట్ల రమేష్ బాబు
కర్నూలు, పల్లెవెలుగు: జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల ప్రజలు ఉపాధి లేక హైదరాబాద్, ముంబాయి, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు ఊట్ల రమేష్ బాబు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫిరెన్స్హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఊట్ల రమేష్ బాబు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు sc st నిరుద్యోగులు మాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, కావున మేము తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అలాగే పశ్చిమ ప్రాంతంలో ప్రతి సంవత్సరము వ్యవసాయ కూలీలు, రైతులు, సాధారణ కూలీలు అందరూ కూడా గుంటూరు బొంబాయి హైదరాబాదు తదితర ప్రాంతాలకు వెళ్తున్నారని, దీంతో వలస కుటుంబీకుల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని పశ్చిమ ప్రాంతంలో వలసలు వెళుతున్నటువంటి వ్యవసాయ కూలీల పిల్లల కోసం రెసిడెన్షియల్ సీజనల్ హాస్టలను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు ఊట్ల రమేష్ బాబు కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆయన డీఆర్ఓ మధుసూదన్ రావుకు అందజేశారు.