కేంద్ర మంత్రి రాజీనామా !
1 min read
పల్లెవెలుగువెబ్ : కేంద్ర మంత్రి పదవికి బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ముక్తార్ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. రాజ్యసభ ఎంపీగా ఉండి మంత్రి అయిన నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభ ఎంపీగా ఆయన పదవీ కాలం గురువారంతో ముగుస్తుంది. మంత్రిగా ముక్తార్ అందించిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం నఖ్వీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. ఆగస్ట్‌లో జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో నఖ్వీ కూడా ఉన్నట్లు తెలిసింది.