నేడే అవిశ్వాస తీర్మానం !
1 min read
పల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మాన ఘట్టం తుది అంకానికి చేరుకుంది. నేషనల్ అసెంబ్లీలో ఆదివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, ప్రధాని పదవికి రాజీనామా చేయడం అనే మూడు అంశాలను మిలిటరీ ఇమ్రాన్ ముందు ఉంచింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే ఇమ్రాన్ మొగ్గు చూపుతున్నారు. తనపై అవిశ్వాసాన్ని అమెరికా కుట్రగా ఆయన అభివర్ణించారు. ఇందుకు తన వద్ద సాక్ష్యాలున్నాయని ఆదివారం మీడియాకు ఓ రహస్య లేఖను చూపారు.