PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బేషరతుగా తీర్మానాన్ని రద్దు చేయాలి…లేకుంటే ఉద్యమిస్తాం

1 min read

విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నిన్న శాసన సభలో గౌ.ముఖ్యమంత్రి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసినందుకు నిరసనగా ఈ రోజు కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం ముందు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విశ్వ హిందూ పరిషత్ జిల్లా,నగర కార్యకర్తలు,హిందూ దళిత సంఘాలతో కలిసి నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ. ఎం.ఎల్.సీ ఎన్నికల్లో ప్రజామోదం లేక పరాజయం పొందిన వై.యస్.ఆర్.సీ.పీ.పార్టీ “ఓటు బ్యాంకు ” రాజకీయాలకు తెరతీస్తూ.తన మతమైన క్రైస్తవులకు మేలు చేయడం కోసం మన రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మత ప్రాదిపతికన రిజర్వేషన్ లు ఇవ్వరాదని ఆర్థికంగా , సామాజికంగా ,రాజకీయంగా వెనుక బడిన హిందూ దళితులైన మాల,మాదిగ సోదరులకు కేటాయించిన రిజర్వేషన్లను నేడు కుయుక్తులతో మతం మారిన క్రైస్థవులకు పంచడం హిందూ దళితులను వంచించడమే అని దీనిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నదని ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్మానాన్ని అంగీరించేది లేదనీ,బేషరతుగా సదరు తీర్మానాన్ని రద్దు చేయాలని లేకుంటే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సోదరుల హక్కులను కాపాడటం కొరకు వారితో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు,జిల్లా సహకార్యదర్శి గోవిందరాజులు మాట్లాడుతూ ఇప్పటికే బీ.సీ.సీ.కేటగిరికి చెందిన క్రైస్తవులు అనధికారికంగా హిందూ దళితులమని ధృవ పత్రాలను పొంది మోసంతో ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తూ మా హిందూ దళితుల అవకాశాలకు గండి కొడుతున్నారనీ….ఇంకా క్రైస్థవులకు రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు చాపకింద నీరులా జరుగుతున్న మతమార్పిడులు ఇకపై రాష్ట్రంలో విపరీతంగా,బాహాటంగానే జరుగుతాయని దీని మా హిందూ దళితులు ఏరకంగానూ సహించేది లేదని వెంఠనే రాష్ట్ర ప్రభుత్వం సదరు క్రైస్తవ రిజర్వేషన్ తీర్మానాన్ని వెంఠనే ఉపసంహరించుకోవాలని లేకుంటే మా హిందూ దళితులంతా ఒక్కటై రాబోయే ఎన్నికల్లో వై.యస్.ఆర్. పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, విభాగ్ కన్వీనర్ నీలి నరసింహ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,సహకార్యదర్శి శివప్రసాద్, జిల్లా సంఘటనా కార్యదర్శి వడ్ల భూపాలాచారి,జిల్లా ప్రచార – ప్రసార కన్వీనర్ రామకృష్ణ, నగర ఉపాధ్యక్షులు శివపురం నాగరాజు, కార్యదర్శి ఈపూరి నాగరాజు, సత్సంగ కన్వీనర్ శేఖర్,రామాలయ ప్రఖంఢ కార్యదర్శి గిరిబాబు,వరసిద్ధి వినాయకాయ ప్రఖంఢ కార్యదర్శి సంజీవయ్య, వేల్పు ల గోపాల్,ప్రేమ్ కుమార్,ప్రమోద్ చక్రవర్తి, చిన్న,ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author