రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ (REZ) ఫేజ్-1”ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా లిమిటెడ్
1 min read
అనంతపురం, న్యూస్ నేడు: రెసోనియా లిమేతేడ్ అనేది ఒక పేరొందిన పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ, ఇంతకూ పూర్వం ఇది స్టెర్లైట్ గ్రిడ్ 32 లిమిటెడ్ (SGL32) గా చిరపరిచితమైనది. “ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అనంతపూర్-II రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ (REZ) ఫేజ్-I” ప్రాజెక్ట్ కొరకు బిడ్‌ను దాఖలు పరచి విజయవంతంగా దక్కించు కున్నాది.2025లో టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ (TBCB) ప్రక్రియ ద్వారా రిసోనియా లిమిటెడ్ వారికి ఈ ప్రాజెక్టు ఇవ్వటం జరిగినది. ప్రత్యేక ప్రయోజన వెహికల్ ద్వారా ఈ హరిత ఇంధన ప్రాజెక్టును 35 సంవత్సరాల కాలం పాటు BOOT (బిల్డ్, ఓన్ , ఆపరేట్, ట్రాన్స్ఫర్ ) పద్ధతి పైన రిసోనియా లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. ఇది భారతదేశంలో TBCB ప్రక్రియ క్రింద రెసోనియా లిమిటెడ్ పొందిన 11వ పవర్ ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు తో కలుపుకుని ఇప్పుడు సుమారు రూ.32,527 కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్వహణను కంపెనీ కలిగి ఉన్నది. ఈ సందర్భంగా శ్రీ అరుణ్ శర్మ, ముఖ్య కార్య నిర్వహణాధికారి, రెసోనియా లిమిటెడ్ వారు మాట్లాడుతూ, అనంతపూర్-II రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ (REZ) ఫేజ్-I” ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో పవర్ ట్రాన్స్ మిషన్ విస్తరణను పెంపొందించటమే కాక రిన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి ) ని గ్రిడ్లకు అనుసంధానించు దేశ వ్యాప్త ప్రయత్నాలలో ఒక కీలకమైన లింకుగా పనిచేస్తుంది అన్నారు. అంతేకాక ఈ మా ప్రయత్నం దక్షిణాది రాష్ట్రాల మార్కెట్ లోనికి రెసోనియా ఉనికి ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రాంతం నుండి 4.5 GW రిన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి ) ఉత్పన్నం చేయుటకు అనంతపురం-II REZ ఫేజ్-1 ప్రాజెక్ట్, క్లిష్టమైన మౌలిక వసతుల ఏర్పాట్లను కలిగి ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా అనంతపూర్-II వద్ద (765/400kV మరియు 400/220kV) భారీ సైజులో గ్రీన్ ఫీల్డ్ పూలింగ్ స్టేషన్ నిర్మించవలసి ఉన్నది. అంతేకాక అనంతపూర్-II నుండి దావణగిరి నకు (సుమారు 150 కి.మీ) మరియు అనంతపురం -II నుండి కడపకు (సుమారు 200 కిమీ) అనుసంధాన పరచు 765 KV D/C పంపిణీ లైన్లు అభివృద్ది చేయాలి. ఇంకనూ గ్రిడ్ స్థిరత్వం మరియు విశ్వసనీయత పెంపొందించుట కొరకు అనంతపురం-II పూలింగ్ స్టేషన్ వద్ద ±300 MVAR STATCOM ఈ ప్రాజెక్టు స్వరూపంలో చేరి ఉంటుంది. భారదేశంలో శిలాజ రహిత ఇంధన -ఆధారిత ( నాన్ – ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ) విద్యుత్ ఉత్పత్తి సామర్త్యతను పెంపొందించుటకు చేపట్టిన ప్రయత్నాలకు ఈ పాజెక్టు దోహదపడుతుంది. భారతదేశానికి సుస్థిరమైన మరియు హరిత ఇంధనం (గ్రీన్ ఎనర్జీ ) అందించు భవిష్యత్తుకు మార్గదర్శకమవుతుంది. ఈ ప్రాజెక్టు భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం (రిన్యువబుల్ ఎనర్జీ ) యొక్క మౌలిక సదుపాయాలను పటిష్ట పరచుటలో ఈ మైలురాయి పాజెక్టు కీలక పాత్రను పోషించటమే కాక, 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధించాలనే దేశ ప్రతిష్టాత్మక లక్ష్యానికి సహకరిస్తుంది.