వృద్ధులను గౌరవించాలి..
1 min read– ఏడీ విజయ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: వయోవృద్ధుల అనుభవం.. మేధస్సు.. ఆలోచనలను భావిపౌరులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ. బుధవారం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవంను పురస్కరించుకుని కర్నూలు కలెక్టరేట్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏడీ విజయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమార్థం ఆసరా పెన్షన్, కంటి వెలుగు తదితర పథకాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం వయో వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సహదేవ రెడ్డి మాట్లాడుతూ కరోన మహమ్మారి కారణంగా ఎందరో సహచరులను కోల్పోయామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోన చికిత్సలలో వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కార్యక్రమంలో వయో వృద్ధుల సంక్షేమ సంఘం కార్యదర్శి నాగరాజు, సభ్యులు, మద్దిలేటి రెడ్డి, క్రిష్టఫర్, పాపారావు, రత్నరెడ్డి, గోవిందురావు మరియు బుట్టా ఫౌండేషన్ మేనేజరు రాజేష్, ప్రతినిధులు హేమలత తదితరులు పాల్గోన్నారు.